A place where you need to follow for what happening in world cup

- Advertisement -

అమీన్‌పూర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

0 113

అమీన్‌పూర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం
– సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, స్మశాన వాటిక అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన

సైబరాబాద్-విశాల భారతి
అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ పనులు పూర్తయితే ప్రాంతంలో రవాణా, పారిశుద్ధ్యం, పౌర సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.ఈ సందర్భంగా నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ప్రధాన రహదారుల సౌందర్యవంతీకరణతో పాటు వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ మీడియన్ల అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల్లో భాగంగా స్మశాన వాటిక అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ పనుల ద్వారా అమీన్‌పూర్ ప్రాంతంలో పౌర సౌకర్యాలు మెరుగుపడి ప్రజల జీవన ప్రమాణాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు,స్థానికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.