A place where you need to follow for what happening in world cup

- Advertisement -

బోనాల వేళ మందుబాబులకు నిరాశ

0 114

బోనాల వేళ మందుబాబులకు నిరాశ
– సైబరాబాద్‌ పరిధిలో వైన్ షాపులు, బార్లు బంద్

సైబరాబాద్ – విశాల భారతి
బోనాల పండుగను పురస్కరించుకుని సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్ ఆదేశాలు జారీ చేశారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం-1968లోని సెక్షన్ 20 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు తొమ్మిదో తేదీన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూతపడనున్నాయి. అయితే ఫైవ్ స్టార్ హోటళ్లలోని బార్లకు, రిజిస్టర్డ్ క్లబ్బులకు ఈ నిషేధం నుంచి మినహాయింపునిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. భక్తులు బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేందుకే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.