A place where you need to follow for what happening in world cup

- Advertisement -

కేపీహెచ్‌బీ 6వ ఫేజ్ పార్కు అభివృద్ధికి కృషి

0 78

కేపీహెచ్‌బీ 6వ ఫేజ్ పార్కు అభివృద్ధికి కృషి
– సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్‌కు వడ్డేపల్లి రాజేశ్వరరావు హామీ

కూకట్‌పల్లి – విశాల భారతి

కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లోని సీనియర్ సిటిజన్స్ పార్కును రాష్ట్ర బీజేపీ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరావు సందర్శించారు. సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆహ్వానం మేరకు, వసంత్ నగర్ డివిజన్ కోఆర్డినేటర్ గురుప్రసాద్ వెంట ఉండగా పార్కులోని సౌకర్యాలను పరిశీలించారు.పార్కులో వాకింగ్ ట్రాక్, బెంచీలు, తాగునీరు, లైటింగ్, పచ్చదనం తదితర సమస్యలను కౌన్సిల్ సభ్యులు రాజేశ్వరరావు దృష్టికి తెచ్చారు. వృద్ధులు ప్రశాంతంగా విహరించేందుకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి అవసరమైన పనులను పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి, ఎంపీ నిధులతో వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు చేపిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో కౌన్సిల్ సభ్యుల అభ్యర్థన మేరకు యోగా కార్పెట్‌ను అందజేశారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేశబత్తుల సుధ, ప్రీతం రెడ్డి, ఎం. కోటేశ్వరరావు, కౌన్సిల్ సభ్యులు సుబ్బరాజు, శివశంకర్ రెడ్డి, అప్పారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.