జయశంకర్ ఆశయసాధనే నిజమైన నివాళి
– డీసీ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ఆల్వీన్ కాలనీ సర్కిల్‌లో జయంతి వేడుకలు
సైబరాబాద్ – విశాల భారతి
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ ప్రేరణ, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ సర్కిల్ -51కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా డీసీ చాముండేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జయశంకర్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆయన జీవితాంతం చేసిన ఉద్యమం భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రజలకు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా సేవలందించడమే నిజమైన నివాళి అని అన్నారు.అనంతరం సిబ్బంది జయశంకర్ ఆశయాలను స్మరించుకుంటూ, తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్కిల్‌కు చెందిన అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొని జయశంకర్‌కు ఘన నివాళులర్పించారు.
