A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ప్రజల ఆదరణ మరువలేనిది

0 148

అశ్వాపురం, విశాలభారతి: అశ్వాపురం మండల ప్రజల ఆదరణ తానెల్లపుడు మరచిపోలేనని, సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అశ్వాపురం గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచ్ భూక్య చందులాల్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అశ్వాపురం గ్రామపంచాయతీ లోని ప్రజలు తనపై చూపిన ఆదరణ నేనెన్నటికి మరిచిపోనన్నారు. గడిచిన సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తనకు సర్పంచ్ గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందన్నారు. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థికి ధీటుగా తనను ప్రజలు ఆదరించి ఓట్లు వేశారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సర్వసాధారణమని ప్రజా తీర్పును తాను ఎల్లప్పుడూ శిరసా వహించి గౌరవిస్తానన్నారు. ఎన్నికలలో ఓటమిపాలైనందుకు కృంగిపోలేదని తనకు వచ్చిన ఓట్లను చూసి గర్వపడ్డానన్నారు. అధికార పక్షం ఓటర్లను ఎన్నో విధాలుగా ప్రలోభాలకు గురిచేసి గెలిచేందుకు అనేక వ్యూహాలు రచించినా వాటన్నింటినీ ఎదుర్కొని ప్రజలు తనకు ఓట్లు వేశారని, ఓటమిని స్పోర్టివ్ గా తీసుకొని అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం దిశగా బిఆర్ఎస్ పార్టీ అండదండలతో మరింత ఉత్సాహంతో పనిచేస్తానని పంచాయతీ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా తాను సిద్ధంగా ఉంటానని 24 గంటలు ఏడు రోజులు ఎప్పుడైనా తనకు సమస్య తెలియజేస్తే మీ సేవకుడుగా కంకణబద్దుడనై మీ ముందు ఉంటానన్నారు.

 

*న్యాయవాద వృత్తిని చేపడుతూనే రాజకీయాల్లో చురుకైన పాత్ర :*

 

న్యాయవాద వృత్తిలో ప్రజలకు సేవ చేస్తూనే రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్న చందులాల్ ను పలువురు ప్రశంసిస్తున్నారు. విద్యావంతుడు చిన్న వయసులోనే రాజకీయాల పట్ల మక్కువతో బిఆర్ఎస్ పార్టీ నుండి గతంలో ఉప సర్పంచ్ గా ఎన్నికై పంచాయతీ అభివృద్ధికి అనేక విధాలుగా పాటుపడిన వ్యక్తి చందు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమిని చవిచూసినప్పటికీ ఎక్కడ మానసికంగా కృంగిపోకుండా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల మధ్యన తిరుగుతూ ఇక రానున్న రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని ఆయన తెలపడం మరో విశేషం. ప్రజలు ఆదరించిన తీరుకు ఎల్లప్పుడూ వారికి జవాబుదారీ గానే ఉంటానని ఈ సందర్భంగా పంచాయతీ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.