లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్
– భవన అనుమతుల కోసం రూ.20 వేలు డిమాండ్
– పక్కా ప్లాన్‌తో పట్టుకున్న అధికారులు
హైదరాబాద్ – విశాల భారతి
భవన నిర్మాణ అనుమతి పత్రాల జారీకి రూ.20 వేలు లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ సంతోష్‌నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సిహెచ్.ప్రభావతి ఏసీబీకి చిక్కారు. బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, పనుల ప్రారంభ అనుమతి ఇచ్చేందుకు ఆమె లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం అధికారులు పక్కా వ్యూహంతో దాడులు నిర్వహించారు.బాధితుడి నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా ప్రభావతిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
