A place where you need to follow for what happening in world cup

- Advertisement -

శాంతినగర్‌లో ఘనంగా తొట్టెల కార్యక్రమం

0 105

శాంతినగర్‌లో ఘనంగా తొట్టెల కార్యక్రమం

శేరిలింగంపల్లి – విశాల భారతి
శాంతినగర్‌లో నిర్వహించిన తొట్టెల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. అమ్మవారి జాతర సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం నేత కొంగరి కృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొని తొట్టెలను సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా కాలనీ యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, భక్తుల సందడితో శాంతినగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి తొట్టెలు సమర్పించారు. కాలనీ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.కార్యక్రమంలో కొంగరి కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు కాలనీ యూత్ సభ్యులు, స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.