కూకట్‌పల్లి చిత్తారమ్మ జాతరలో వడ్డేపల్లి రాజేశ్వరరావు పూజలు
కూకట్‌పల్లి,విశాల భారతి
ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా కూకట్‌పల్లిలోని శ్రీశ్రీశ్రీ చిత్తారమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూల తొట్టెలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
జాతరకు వచ్చిన భక్తుల కోసం రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు రాజేశ్వరరావు దంపతులను సన్మానించారు. జాతరను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు.
