A place where you need to follow for what happening in world cup

- Advertisement -

రంగనాథ్‌కు హైకోర్టు షాక్! తొలగించాలని సీఎస్‌కు ఆదేశం

0 402

రంగనాథ్‌కు హైకోర్టు షాక్! తొలగించాలని సీఎస్‌కు ఆదేశం
– కోర్టు ధిక్కరణ కేసుల్లో తీవ్ర ఆగ్రహం
– వెంటనే ప్రత్యామ్నాయ అధికారిని నియమించాలని స్పష్టీకరణ

హైదరాబాద్ – విశాల భారతి
హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసుల విచారణ సందర్భంగా ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రంగనాథ్ స్థానంలో సమర్థుడైన ప్రత్యామ్నాయ అధికారిని వెంటనే నియమించాలని స్పష్టం చేసింది.కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జరిగిన నిర్లక్ష్యం, పదేపదే ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలపై దాఖలైన పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లను హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం, న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని వ్యాఖ్యానించింది.ఈ నేపథ్యంలో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన స్థానంలో అనుభవం కలిగిన అధికారిని నియమించాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తదుపరి విచారణ నాటికి పూర్తి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రంగనాథ్‌పై ఇటీవల కూల్చివేతలు, నోటీసులు, కోర్టు ఆదేశాల అమలు అంశాల్లో పలు వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం కొత్త కమిషనర్ నియామకంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.