A place where you need to follow for what happening in world cup

- Advertisement -

గచ్చిబౌలి-కొండాపూర్‌లో హైడ్రా కొరడా  

0 178

గచ్చిబౌలి-కొండాపూర్‌లో హైడ్రా కొరడా
– బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్‌బండ వరకు ఆక్రమణల తొలగింపు
– తెల్లవారుజాము 4 నుంచి ఆపరేషన్.. భారీ పోలీసు బందోబస్తు
– రోడ్డుకు ఇరువైపులా వెలసిన అక్రమాలపై సీఎంసీ, హైడ్రా చర్యలు

సైబరాబాద్ – విశాల భారతి
గచ్చిబౌలి కొండాపూర్ ప్రధాన రహదారిపై ఏళ్లుగా పేరుకుపోయిన ఆక్రమణలపై హైడ్రా, సీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్‌బండ వరకు రోడ్డుకు ఇరువైపులా వెలసిన అక్రమ కట్టడాలు, షెడ్లు, తోపుడు బండ్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలను శనివారం తెల్లవారుజాము నుంచి తొలగించారు. ఉదయం నాలుగు గంటల నుంచే హైడ్రా, సీఎంసీ సిబ్బంది జేసీబీలు, టిప్పర్లతో రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలు, దుకాణాల ముందు భాగంలో ఫుట్‌పాత్‌ను ఆక్రమించి వేసిన షెడ్లు, బోర్డులు, మెట్లను కూల్చివేశారు. స్థానికులు చూస్తుండగానే జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

భారీగా ట్రాఫిక్ జామ్…
ఒకేసారి పెద్ద సంఖ్యలో వాహనాలు, యంత్రాలతో తొలగింపు పనులు చేపట్టడంతో బొటానికల్ గార్డెన్-మసీద్‌బండ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.ప్రధాన రహదారులపై ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్యలు, పాదచారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎవరెంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఆక్రమణల తొలగింపు నిరంతరం కొనసాగుతుంది’ అని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపుతో రహదారి విశాలంగా మారడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.