A place where you need to follow for what happening in world cup

- Advertisement -

చెత్త కనిపిస్తే ఫొటో తీసి పంపండి.. చర్యలు తీసుకుంటాం

0 84

చెత్త కనిపిస్తే ఫొటో తీసి పంపండి.. చర్యలు తీసుకుంటాం
– అక్రమంగా చెత్త వేస్తున్న వారిపై ఫిర్యాదులకు సీఎంసీ పిలుపు

సైబరాబాద్ – విశాల భారతి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం అవసరమని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కోరింది. తమ పరిసరాల్లో ఎక్కడైనా అక్రమంగా చెత్త పారబోస్తున్నట్లు గమనిస్తే వెంటనే ఫొటో తీసి సామాజిక మాధ్యమం **ఎక్స్ (ట్విట్టర్)**లో పోస్టు చేయాలని సూచించింది. పోస్టులో @CMC_Offclను ట్యాగ్ చేయడంతో పాటు ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రాంతాన్ని పేర్కొనాలని తెలిపింది.ప్రజలు పంపే ఫొటోలు, వివరాల ఆధారంగా సంబంధిత బృందాలు వెంటనే స్పందించి చెత్తను తొలగించడంతో పాటు అవసరమైన చర్యలు చేపడతాయని సీఎంసీ వెల్లడించింది. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన సైబరాబాద్ నిర్మాణం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. “మీరు ఫొటో పంపండి.. చర్యలు మేము తీసుకుంటాం” అంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎంసీ పిలుపునిచ్చింది.

Leave A Reply

Your email address will not be published.