A place where you need to follow for what happening in world cup

- Advertisement -

మాతృశ్రీనగర్ డీఏవీ పాఠశాలలో మిన్నంటిన కృష్ణాష్టమి సంబరాలు

0 56

మాతృశ్రీనగర్ డీఏవీ పాఠశాలలో మిన్నంటిన కృష్ణాష్టమి సంబరాలు
– ఉత్సాహంగా సాగిన ఉట్టి ఉత్సవం
– అలరించిన బాలకృష్ణుల ముచ్చటైన ముస్తాబులు

మియాపూర్,విశాల భారతి
మియాపూర్ పరిధిలోని మాతృశ్రీనగర్ కాలనీలో ఉన్న డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ కే. ఆనందవల్లి ముఖ్య అతిథిగా హాజరై, ఆమె ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు బాలకృష్ణుడు, రాధల వేషధారణలో వేదికపై సందడి చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, కృష్ణలీలల ఘట్టాలు భక్తిపారవశ్యాన్ని నింపాయి.వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంప్రదాయ ఉట్టి కొట్టే కార్యక్రమం అత్యంత కోలాహలంగా సాగింది. ఉట్టిని కొట్టేందుకు విద్యార్థులు పోటీపడటంతో పాఠశాల ప్రాంగణమంతా కేరింతలతో హోరెత్తింది. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు శ్రీకృష్ణుడి బోధనలు, భగవద్గీత విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కే. ఆనందవల్లితో పాటు ఉపాధ్యాయులు హిమబిందు సాగర్, లైలీ, అనురాధ ఠాగూర్, హిమబిందు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.