A place where you need to follow for what happening in world cup

- Advertisement -

టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ బదిలీలు

0 442

టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ బదిలీలు
– సీఎంసీలో 16 మంది చైన్‌మెన్లకు కొత్త పోస్టింగ్‌లు
– తక్షణమే అమల్లోకి ఉత్తర్వులు

సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న 16 మంది చైన్‌మెన్లు, వార్డు అధికారులకు పరిపాలనా అవసరాల దృష్ట్యా భారీ ఎత్తున బదిలీలు చేపట్టారు. కమిషనర్ జి. సృజన, ఐఏఎస్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ బదిలీలు తక్షణ ప్రభావంతో అమల్లోకి వచ్చాయి. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ ప్రస్తుత విధుల నుంచి రిలీవ్ అయి, కొత్త పోస్టింగ్‌లలో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

ఉత్తర్వుల ప్రకారం ఎల్. లచ్చయ్యను సర్కిల్-46 నుంచి సర్కిల్-47 (అమీన్‌పూర్)కు, లింగంను సర్కిల్-48 నుంచి సర్కిల్-53 (మూసాపేట్)కు, కరణ్ ను సర్కిల్-48 నుంచి సర్కిల్-45 (నర్సింగి)కి, పి. కుమారస్వామిను సర్కిల్-50 నుంచి సర్కిల్-49 (శేరిలింగంపల్లి)కి, సి. నాగయ్యను సర్కిల్-52 నుంచి సర్కిల్-51 (ఆల్విన్ కాలనీ)కి, ఎం. మోహన్ ను సర్కిల్-53 నుంచి సర్కిల్-54 (చింతల్)కు బదిలీ చేశారు.

అలాగే మల్లేశ్ ను సర్కిల్-54 నుంచి సర్కిల్-50 (మాదాపూర్)కు, డి. ఐలయ్యను సర్కిల్-55 నుంచి సర్కిల్-52 (కూకట్‌పల్లి)కు, ఎం. రఫత్ ను సర్కిల్-55 నుంచి సర్కిల్-59 (దుండిగల్)కు, రజియుద్దీన్ ను సర్కిల్-57 నుంచి సర్కిల్-56 (కొంపల్లి)కు, హరీష్ కుమార్ ను సర్కిల్-58 నుంచి సర్కిల్-60 (మెడ్చల్)కు బదిలీ చేస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు.

ఇక వార్డు అధికారుల్లో శ్రీకాంత్ నాయక్ ను సర్కిల్-58 నుంచి సర్కిల్-57 (జవహర్‌నగర్)కు, శ్రీకాంత్ గౌడ్ ను సర్కిల్-58 నుంచి సర్కిల్-55 (జీడిమెట్ల)కు, వెంకటరావును సర్కిల్-58 నుంచి సర్కిల్-48 (మియాపూర్)కు, డి. మధును సర్కిల్-60 నుంచి సర్కిల్-58 (నిజాంపేట్)కు బదిలీ చేశారు. అలాగే మోహన్ ను సర్కిల్-49 నుంచి సర్కిల్-46 (పటాన్‌చెరు)కు నియమించారు.

బదిలీ అయిన అధికారులు ఆలస్యం చేయకుండా కొత్త విధుల స్థానాల్లో చేరాలని కమిషనర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సంబంధిత డిప్యూటీ కమిషనర్లు అధికారులు రిలీవ్ అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, కొత్త స్థానాల్లో విధుల్లో చేరినట్లు నిర్ధారించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.