A place where you need to follow for what happening in world cup

- Advertisement -

విద్యార్థి దశ చాలా అందమైనది 

0 162

చర్ల, విశాలభారతి: విద్యార్థి దశ ఎంతో అందమైన మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు కూడా నిక్కరు వేసుకోవాలననే కుతూహలం కలుగుతోందని సిపిఐ సీనియర్ నాయకులు, పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ అన్నారు. శనివారం చర్ల మండల కేంద్రంలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులుగా ఉండడం ఎంతో, ఈ విద్యార్థి దశలో నేర్చుకున్న పాఠాలు జీవితాలను మలుపు తిప్పుతాయని చెప్పారు. సమస్త జీవరాశులలో మానవ జన్మ ఎంతో పవిత్రమైనదని. అలాంటి ఈ మానవ జన్మకు సార్ధకత తీసుకురావాలన్నారు. సమ సమాజ స్థాపన కావలసిన జ్ఞానం తరగతి గదుల నుండే మొదలవుతుందని, తోటి వారికి తోడ్పాటు అందిస్తూ సమాజాన్ని తీర్చి దిద్దాలన్నారు. అంతా చక్కగా చదువుకొని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పేరు తేవాలని, జీవితాల్లో స్థిరపడి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మారుమూల ప్రాంతంలో విలువలతో కూడిన విద్యా ప్రమాణాలను నేర్పిస్తున్న డాక్టర్ డి ఎన్ కుమార్ ఆశయం తనను ఆకట్టుకుందని, ఈ ఆశయం రాబోయే రోజుల్లో మరింత గొప్పగా చిగురించాలని చెప్పారు. ఈ కార్యక్రమం లో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ కేషాబీర్ పాషా మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.