A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ప్రతిపక్షాలపై పోలీసుల దాడి అప్రజాస్వామికం

0 283

ప్రతిపక్షాలపై పోలీసుల దాడి అప్రజాస్వామికం
– ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని అడ్డుకోలేరు
– చిర్రా రవీందర్‌ యాదవ్‌

శేరిలింగంపల్లి – విశాల భారతి
శాసనసభకు నల్లచొక్కాలతో హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని శేరిలింగంపల్లి ఉద్యమ నేత చిర్రా రవీందర్‌ యాదవ్‌ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపే ప్రతిపక్ష హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగడం, పలువురు ప్రజాప్రతినిధులకు గాయాలయ్యే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. పోలీసుల అత్యుత్సాహంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నల్లచొక్కాలను అడ్డుకోగలరేమో కానీ ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని ప్రభుత్వం అడ్డుకోలేదని ఆయన హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.