అన్యాయంపై ప్రశ్నిస్తూ.. బాధితులకు అండగా నిలుస్తా
- సతీష్ యాదవ్‌కు మానవ హక్కుల జిల్లా అధ్యక్ష బాధ్యతలుమియాపూర్ – విశాల భారతి
అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, మియాపూర్ ఎస్‌ఎంఆర్ వినయ్ ఐలాండ్స్ నివాసి డాక్టర్ సతీష్ యాదవ్‌కు మరో కీలక బాధ్యత దక్కింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. గురువారం రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అఫ్జల్ చేతుల మీదుగా సతీష్ యాదవ్ నియామక పత్రాన్ని అందుకున్నారు.ప్రస్తుతం రెండు నెలల పాటు రంగారెడ్డి జిల్లా బాధ్యతలను నిర్వహించనున్న ఆయనకు అనంతరం రాష్ట్రస్థాయిలో పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అఫ్జల్ వెల్లడించారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు అఫ్జల్, జాతీయ అధ్యక్షుడు, ఇతర రాష్ట్ర సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పేదలు, పీడిత వర్గాలకు అండగా నిలవడంతో పాటు ఎక్కడ అన్యాయం జరిగినా బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. మానవ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు.అఖిలపక్ష ఐక్యవేదికను రాష్ట్రస్థాయిలో విస్తరించేందుకు త్వరలో అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించనున్నట్లు సతీష్ యాదవ్ తెలిపారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్‌ను మరింత విస్తృతం చేసి ప్రజలకు చేరువ చేస్తామని పేర్కొన్నారు.
