A place where you need to follow for what happening in world cup

- Advertisement -

దోచేస్తున్న హిజ్రాలు

0 213

– హిజ్రాల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి
– బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు
– ట్రాఫిక్ సిగ్నల్స్, రైల్వేస్టేషన్లు, రైళ్లు వేటిని వదలడం లేదు
– ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే వెంటనే ప్రత్యక్షమవుతున్నారు
– ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు
– అడిగినంత ఇవ్వకుంటే వికృతచేష్టలతో ఇబ్బందులు
– వారి ఆశీర్వాదం ఉంటే మంచిదని కొందరి పిచ్చి నమ్మకం
– ఈ క్రమంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు
– 2019లో ఏకంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు

విశాలభారతి, స్టేట్ బ్యూరో: హిజ్రాల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రైల్వేస్టేషన్లు, రైళ్లు ఇలా ఎక్కడ చూసిన వారే కనిపిస్తున్నారు. ఇక ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే బంధువుల కంటే ముందే హిజ్రాలు ప్రత్యక్షమవుతున్నారు. ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ఐదో పదో కాకుండా వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు. అది చిన్న పంక్షనా, పెద్దదా అనేది వారికి అవసరం లేదు. అడిగినంత ఇవ్వాల్సిందే. లేదంటే వికృతచేష్టలతో అక్కడ ఉన్నవారిని తల దించుకునేలా చేస్తున్నారు. హిజ్రాల పేరు చెబితేనే కొన్ని ప్రాంతాలవాసులు హడలి పోతున్నారు. ఏదైనా మంచి పని చేసినప్పుడు వారి ఆశీర్వాదం ఉంటే మంచి జరుగుతుందని కొందరు వ్యక్తులు బలంగా నమ్ముతారు. మనుషుల పిచ్చిని సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ఒక్కోసారి దాడులకు సైతం పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి.

శుభకార్యాల సీజన్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ సిటీ పరిధిలో హిజ్రాలు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. గృహ ప్రవేశం, పెళ్లిళ్లు, బర్త్ డే ఫంక్షలు, షాపు ఓపెనింగ్ వంటి కార్యక్రమాలు జరిగితే చాలా క్షణాల్లో వాలిపోతుంటారు. నోటి ఇష్టం వచ్చినంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మావల్ల కాదని మొండి కేస్తే, హిజ్రాలు తమ గ్యాంగులను రప్పించి నానారభస చేస్తుంటారు. ఇటీవలకాలంలో వారి అరాచకాలు ఎక్కువయ్యాయి. తాజాగా హైదరాబాద్ శివారులో అలాంటి ఘటన వెలుగుచూసింది. ఇటీవలే కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసిన ఓ కుటుంబంపై హిజ్రాలు దాడి చేశారు. రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనడంతో అసభ్యంగా దూషించారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన హిజ్రాలు.. ఆ తర్వాత మూడు ఆటోల్లో గుంపుగా వచ్చి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇంటి గేటును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. శబ్దం విని బయటకు వచ్చిన సదానందంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ గొడవను గమనించి చుట్టుపక్కల వారు రావడంతో హిజ్రాలు పారిపోయారు.హిజ్రాల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ శివారులో హిజ్రాలు ఈ విధంగానే రెచ్చిపోతున్నారు. శుభకార్యాలకు మంచి రోజులున్న సమయంలో తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో ఓ వాహనం లేదా ఆటోలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో చక్కర్లు కొడతారు. ఎక్కడైనా సందడి నెలకుంటే చాలు.. ఆ ప్రాంతానికి వచ్చి వారి టీమ్ సభ్యులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడం, ఆపై లొకేషన్ షేర్ చేయడం జరుగుతోంది. స్థానిక హిజ్రాలు ఎంత ఇస్తే అంత తీసుకుంటారని, నార్త్ నుంచి కొంతమంది హిజ్రాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నారని అంటున్నారు. వారే ఆ దందా సాగిస్తున్నారని అంటున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక హిజ్రాలు చెబుతున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల శివారు ప్రాంతాల్లో హిజ్రాలు వీరంగం సృష్టిస్తున్నారు. కీసర ప్రాంతంలో హిజ్రాలు బరి తెగించారు.. కంటిన్యూ చేస్తున్నారు కూడా. వారి అరాచకాలకు అంతులేకుండా పోతోంది. కొత్త ఇంట్లోకి దిగితే లక్ష ఇవ్వాల్సిందే. లేదంటే చాలు, వెంటనే ఫోన్ చేసి వారి సభ్యులను పిలిస్తారు. ఆ తర్వాత నానాయాగీ చేస్తుంటారు. ఓ ఇంటి యజమానిపై ఏకంగా కర్రలతో దాడి చేసి గాయపడిచారు.

2019 ఫిబ్రవరి నెలలో అర్ధరాత్రి సమయంలో ఉప్పల్ రింగ్‌ రోడ్డు సమీపంలో హిజ్రాలు విధ్వంసం సృష్టించారు. బస్‌ స్టాప్‌ లో కార్లు ఆపిన వారిపై దాడికి దిగి తీవ్రంగా కొట్టారు. అడ్డువచ్చిన వారిని కూడా కొట్టి.. వాళ్ల మెడలో ఉన్న బంగారు గొలుసులు ఆభరణాలు, పర్సులను మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. భయంతో సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ కు బాధితులు పరుగులు తీశారు. అంతటితో ఆగుకుండా పోలీస్‌ స్టేషన్‌ కు కూడా వెళ్లి వీరంగం సృష్టించారు. పోలీస్‌ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేస్తూ అడ్డు తగిలిన ముగ్గురు పోలీసులను కూడా తీవ్రంగా గాయపరిచారు. సమయానికి ఎక్కువ మంది పోలీసులు అందుబాటులో లేకపోవడం – హిజ్రాలు భారీ సంఖ్యలో ఉండటంతో పరిస్థితి భయానకంగా మారింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఏసీపీ గాంధీ నారాయణపైకి దూసుకెళ్లి దాడికి యత్నించారు. వారు హద్దులు దాటి ప్రవర్తించడంతో పాటు కోపంతో ఊగిపోయారు. బూతులు తిట్టుకుంటూ నానా మాటలు అంటూ హంగామానే సృష్టించారు. ఈ ఘటనల నేపథ్యంలో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హిజ్రాల ఆగడాలు పెరుగుతున్నాయని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.