‘విశాల భారతి’ కథనానికి స్పందన
– హైదర్‌నగర్‌లో చెత్త తొలగింపు.. శుభ్రం చేసిన సిబ్బంది
– ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద చర్యలు..
– డీసీ చాముండేశ్వరి ఆదేశాలతో పనులు వేగవంతం
సైబరాబాద్ – విశాల భారతి
ఆల్విన్ కాలనీ సర్కిల్-51 పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్ ప్రధాన రహదారిపై ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద పేరుకుపోయిన చెత్త, ఎండిన ఆకులు, కొమ్మలపై ‘విశాల భారతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఉప కమిషనర్ చాముండేశ్వరి వెంటనే స్పందించి పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు.శనివారం సిబ్బంది బాబ్‌క్యాట్ యంత్రంతో అక్కడ పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. భక్తులు, స్థానికులు రాకపోకలు సాగించే ఆలయం వద్ద చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని కథనంలో పేర్కొనడంతో అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు.ప్రధాన రహదారులు, ఆలయాల పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా నిత్యం పర్యవేక్షిస్తాం. కథనం ద్వారా సమస్యను మా దృష్టికి తెచ్చిన ‘విశాల భారతి’కి కృతజ్ఞతలు. ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తాం’ అని డీసీ చాముండేశ్వరి తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
