నడిరోడ్డుపై రౌడీషీటర్ దారుణ హత్య
– వేటాడి మరీ నరికి చంపిన దుండగులు
– మైలారదేవుపల్లిలో తీవ్ర కలకలం
రాజేంద్రనగర్, విశాల భారతి
మైలారదేవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ రౌడీషీటర్‌ను గుర్తుతెలియని దుండగులు వెంబడించి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది.ఘటనపై సమాచారం అందుకున్న మైలారదేవుపల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించింది.హత్యకు పాత కక్షలు, గతంలో ఉన్న వివాదాలు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హత్యకు ముందు బాధితుడిని నిందితులు వెంబడించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు గల అసలు కారణాలు, నిందితుల వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడికానున్నాయి.
