A place where you need to follow for what happening in world cup

- Advertisement -

2036 ఒలింపిక్స్‌కు తెలంగాణే వేదిక కావాలి – సీఎం రేవంత్ రెడ్ది 

0 115

2036 ఒలింపిక్స్‌కు తెలంగాణే వేదిక కావాలి
– సీఎం రేవంత్ రెడ్ది

సైబరాబాద్ – విశాల భారతి
2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. గురువారం గచ్చీబౌలి స్టేడియంలో గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆయన శ్రీకారం చుట్టారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష, మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.82 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటీ, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని నిర్మించి 2028 డిసెంబరులో ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. తెలంగాణలో స్పష్టమైన క్రీడా విధానాన్ని అమలు చేస్తున్నామని, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఆరుగురు తెలంగాణ క్రీడాకారులకు రూ.7.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను సీఎం అందజేశారు. అలాగే 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్, జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ మీట్‌తో పాటు హాకీ ఇండియా లీగ్, ప్రపంచ పికిల్‌బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. “తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.