A place where you need to follow for what happening in world cup

- Advertisement -

చదువు అబ్బడం లేదని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

0 53

చదువు అబ్బడం లేదని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

సైబరాబాద్ ,విశాల భారతి
చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం… మియాపూర్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌లో నివాసముంటున్న ఓ పెయింటర్‌ కుమారుడు మల్లికార్జున (16) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా చదువు సరిగా అబ్బడం లేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పసి వయసులోనే కుమారుడు నూరేళ్లూ నిండకుండానే కన్నుమూయడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.