A place where you need to follow for what happening in world cup

- Advertisement -

బోనాల వేడుకల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావు

0 90

బోనాల వేడుకల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావు

కూకట్ పల్లి – విశాల భారతి
ఆషాఢ మాస బోనాల సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ కైలాపూర్ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆరో కళ్యాణ మహోత్సవం, శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా ఆదివారం జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఆహ్వానం మేరకు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.