A place where you need to follow for what happening in world cup

- Advertisement -

గడువులోగా ఓటరు సర్వే పూర్తి చేయాలి  

0 61

గడువులోగా ఓటరు సర్వే పూర్తి చేయాలి
– బీఎల్ఓ యాప్ డిజిటలీకరణ పనులు వేగవంతం చేయాలని ఏఈఆర్వో ఆదేశం
– సమతానగర్‌లో ఫారాల నమోదును పరిశీలించిన డీసీ

సైబరాబాద్ – విశాల భారతి
ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, డిజిటలీకరణలో భాగంగా శనివారం సమతానగర్ కాలనీలోని పోలింగ్ స్టేషన్-476 పరిధిలో ఏఈఆర్వో, డీసీ ఆల్విన్ కాలనీ సర్కిల్-51 చాముండేశ్వరి బీఎల్ఓ యాప్‌లో నమోదు చేస్తున్న ఫారాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీఎల్ఓలు, సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి నింపిన ఫారం-6, 7, 8 వివరాలను తనిఖీ చేశారు. ఓటరు పేరు, చిరునామా, ఫోటో, ఇతర వివరాలు సరిగ్గా నమోదు అయ్యాయో లేదో బీఎల్ఓ యాప్‌లో క్రాస్ చెక్ చేశారు. తప్పులు లేకుండా 100 శాతం పారదర్శకంగా నమోదు చేయాలని, నిర్ణీత గడువులోగా ఇంటింటి సర్వే పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. ఎవరైనా ఓటరు అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోతే వెంటనే ఫారం-6 ద్వారా నమోదు చేయాలని, మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లను ఫారం-7 ద్వారా తొలగించాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.