రోడ్డుపై చెత్తపారబోసిన మహిళ క్షమాపణ
– స్వచ్ఛ ఆటోకే చెత్త ఇస్తానని లిఖితపూర్వక హామీ
కూకట్ పల్లి – విశాల భారతి
రోడ్డుపై చెత్త వేస్తూ నిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన దీనబంధు కాలనీ మహిళ నేడు సర్కిల్ కార్యాలయానికి వచ్చి లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులను కలిసి తన తప్పును ఒప్పుకున్నారు. ఇకపై రోడ్డుపై చెత్త వేయబోనని, ప్రతిరోజూ వచ్చే స్వచ్ఛ ఆటోకే చెత్త అందజేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మహిళ వివరణ తీసుకున్న అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.
